ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా అక్కడ మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల  టీ20 సిరీస్ కూడా మొదలు పెట్టింది. కాగా ఈ టి20 సిరీస్ లో భాగంగా కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో అదరగొడుతుంది అని చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగియగా.. ఈ రెండింటిలో కూడా టీమిండియా ఘనవిజయాన్ని సాధించింది అని చెప్పాలి. దీంతో 2-0 తేడాతో ప్రస్తుతం పూర్తిస్థాయి ఆదిత్యాన్ని కొనసాగిస్తుంది.


 కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా.. ఇక నేడు మూడో మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఇక రెండు మ్యాచ్లలో గెలిచిన పట్టుదలతోనే ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా గెలవాలని అనుకుంటుంది. ఇలా గెలిచి  శ్రీలంక జట్టుకి సొంత దేశంలోనే షాక్ ఇచ్చి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంది భారత జట్టు. కాగా ఈరోజు భారత్ శ్రీలంక మధ్య పల్లెకెళ్లే వేదికగా మూడో టి20 మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టు.. ఇక చివరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. కాగా ఇక ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో టి20 మ్యాచ్ లో జట్టులో పలు మార్పులు చేసుకుని బరిలోకి దిగే చాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. సాయంత్రం ఏడున్నర గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.



అయితే టీమిండియా టి20 కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సారధిగా ఎలా రాణిస్తాడు అని అనుకుంటుండగా ఇక రెగ్యులర్ కెప్టెన్ గా బరిలోకి దిగిన మొదటి సిరీస్ లోనే అదరగొట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: