అందరి క్రికెటర్ల లాగా ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కానీ మహేంద్రుడికి సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో ఇక ఇంటర్నెట్ జనాలను ఆకర్షిస్తూనే ఉంటుంది అని చెప్పాలి. కాగా చాలామంది మాజీ క్రికెటర్లు క్రికెట్ గురించి ఏదో ఒకటి మాట్లాడటం చేస్తూ ఉంటారు. కానీ అదే క్రికెట్లో లెజెండ్ అయిన ధోని మాత్రం ఎప్పుడూ ఎక్కడ క్రికెట్ గురించి మాట్లాడటం, ఆటగాళ్ల ప్రదర్శన గురించి రివ్యూ ఇవ్వడం కూడా అసలు చేయడు అని చెప్పాలి. అలాంటి ధోని ఇటీవల టీమిండియాలో తన ఫేవరెట్ బౌలర్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.
దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రానే తన ఫేవరెట్ బౌలర్ అంటూ మహేంద్రసింగ్ ధోని చెప్పుకొచ్చాడు. బౌలర్లలో ఫేవరెట్ను ఎంచుకోవడం చాలా సులభం. కానీ బ్యాటర్లల్లో మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మన దగ్గర చాలామంది మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. అంటే మంచి బౌలర్లు లేరు అని అనలేను. కానీ బ్యాట్స్మెన్ లలో మాత్రం ఫేవరెట్ ఎంపిక చేయలేను అంటూ ధోని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.