సాదరణంగా క్రికెట్లో ఓపెనర్ స్థానం ఎంత కష్టమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఎందుకంటే ఓపెనర్ గా ఏ ఆటగాడు వస్తే ఇక జట్టు గెలుపు ఓటముల భారం మొత్తం అతని భుజాలపైనే ఉంటుంది. ఓపెనర్ గా వచ్చిన ఆటగాడు మంచి ఆరంభాలు ఇస్తే ఆ తర్వాత వచ్చిన ప్లేయర్ లందరూ కూడా స్వేచ్ఛగా ఆడుతూ భారీగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓపెనర్ గా వచ్చి ఎవరైనా ఆటగాడు విఫలమవుతే ఇక జట్టు మొదట్లోనే కష్టాల్లో పడిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అందుకే ప్రతి క్రికెట్ మ్యాచ్ లో ఏ ఫార్మాట్లో అయినా సరే ఇక ఓపెనర్లు ఎలా రాణించారు. ఎలాంటి భాగస్వామ్యాన్ని నిర్మించారు అన్నదే ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఇలాంటి ఓపెనింగ్ భాగస్వామ్యాలే జట్టు గెలుపును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఇలా ఓపెనర్ స్థానం ఎంతో ముఖ్యం. చాలా మంది ఓపెనర్ గా రాణించాలని అనుకుంటూ చివరికి విఫలం అవుతూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ మాత్రం.. ఇక ఎన్నో ఏళ్లుగా భారత జట్టు తరఫున అదిరిపోయే ఓపెనింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇలా ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తూ మంచి ఆరంభాలు ఇచ్చి ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవల మరో అరుదైన రికార్డును కూడా సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్ గా 15000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా ఈ రికార్డును అందుకున్న రెండవ ఓపెనర్గా చరిత్ర సృష్టించాడు. సచిన్ 331 ఇన్నింగ్స్ లో ఓపెనర్గా 15000 పరుగులను పూర్తి చేయగా.. రోహిత్ 352 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను అందుకున్నాడు. రోహిత్ తర్వాత స్థానంలో వార్నర్, సేహ్వగ్ ఉన్నారు. కాగా ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: