ఒక్కసారి క్రీజ్ లో కుదురుకున్నాడు అంటే చాలు.. ఇక అతన్ని ఆపడం ఎవరి తరము కాదు. బౌలర్లు అతని వికట్ తీయడానికి ఆపసోపాలు పడిపోతూ ఉంటారు అని చెప్పాలి. రోహిత్ మాత్రం ఎంతో అలవోకగా సిక్సర్లు బాదుతూ ఇక తన విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు. ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అటు భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా వన్డే సిరీస్ కెప్టెన్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు రోహిత్.
ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో బాగా రాణించడం ద్వారా.. మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో తొలి వన్డేలో హిట్ మాన్ ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ 134 ఇన్నింగ్స్ లోనే 234 సిక్సర్లు కొట్టాడు. ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక రోహిత్ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ 180 ఇన్నింగ్స్ లో 233 సిక్సర్లు, తర్వాత ధోని 211 సిక్సర్లు, రికీ పాంటింగ్ 171 సిక్సర్లతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి. కాగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది.