ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో సిరీస్ లు ఆడుతుండగా.. ఇప్పటికే t20 సిరీస్ ముగించుకుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో టి20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఇక శ్రీలంక జట్టును వారి సొంత గడ్డమీదే క్లిన్ స్వీప్ చేసేసింది అన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో 3-0 తేడాతో గెలుచుకోగలిగింది. అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ఆడుతుంది  భారత జట్టు.


 కాగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య గత గణాంకాలు చూసుకుంటే పూర్తిగా భారత జట్టుదే ఆధిపత్యం  కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఈ వన్డే సిరీస్ లో కూడా భారత జట్టు ఘనవిజయాన్ని సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే టి20 సిరీస్లో లాగానే వన్డే సిరీస్ ను కూడా క్లీన్స్వీప్ చేస్తే చూడాలని అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో మొదటి మ్యాచ్ లోనే భారత జట్టుకు చేదు అనుభవం ఎదురయింది. దాదాపు గెలిచేసాం అనుకున్న మ్యాచ్ ను చివరికి టై గా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.


 చివర్లో భారీ షాట్ ఆడాలి అనుకున్న అర్షదీప్ సింగ్  వికెట్ కోల్పోవడంతో ఇక మ్యాచ్ టై గానే ముగిసింది అని చెప్పాలి  అయితే ఇలా తొలి వన్డే మ్యాచ్  లో చేజేతులారా విజయాన్ని చేజార్చుకున్న భారత్ నేడు శ్రీలంకతో రెండో వన్డే మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. తొలి మ్యాచ్ లో జరిగిన పొరపాట్లను రిపీట్ చేయకుండా రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉండగా.. రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. రోహిత్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గప్రదర్శన చేస్తే టీమిండియాదే గెలుపు అనడంలో సందేహం లేదు. అయితే ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: