సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుందని.. ఎంతో మంది నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు. 30 ప్లస్ వయస్సు వచ్చింది అంటే చాలు బౌలర్లు ఇక రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు.  ఇక ఫాస్ట్ బౌలర్లకు తరచూ గాయాలు అవడం ఫిట్నెస్ సమస్యలు రావడం కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెబుతూ ఉంటారు. కానీ తాను ఈ కోవలోకి వచ్చే ఆటగాడిని కాదు అన్న విషయాన్ని నిరూపిస్తూ ఎప్పటికప్పుడు గోడకు కొట్టిన బంతిలా.. ఎగసిపడుతున్న కిరటంలా మహమ్మద్ షమీ మాత్రం మళ్లీ భారత జట్టులోకి దూసుకు వస్తూనే ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి తన ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు.


 ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాను విజయ తీరాలకు నడిపిస్తూనే ఉన్నాడు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మహమ్మద్ షమీ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లగలిగింది అంటే అది మహమ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే అనడంలో సందేహం లేదు. అయితే వరల్డ్ కప్ తర్వాత అతను గాయం బారిన పడటంతో టీమిండియాకు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న షమీ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ మధ్యకాలంలో గాయపడిన ఆటగాడు మళ్ళీ జట్టులోకి రావాలంటే దేశవాలి క్రికెట్ లో కొన్ని మ్యాచ్లు ఆడాల్సిందే అనే నిబంధన పెట్టింది బిసిసిఐ.


 ఈ క్రమంలోనే మహమ్మద్ షమి ఇక ఇప్పుడు దేశవాలి క్రికెట్ ఆడెందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో షమీ రంజి ట్రోఫీ ఆడబోతున్నాడు. బెంగాల్ తరఫున ఆయన బరిలోకి దిగనున్నట్లు సమాచారం. తర్వాత బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఇక మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగం మనం చేస్తాడట మహమ్మద్ షమి. కాగా 33 ఏళ్ల వయసులో కూడా షమీ యువ బౌలర్లకు ఎక్కడ తీసిపోకుండా.. పదునైన బౌలింగ్తో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను ఎన్ని సార్లు గాయాల పాలైనప్పటికీ బిసిసిఐ మాత్రం ఇక జట్టులో అతనికి ఛాన్సులు ఇస్తూనే వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: