సాధారణంగా ఒక ఆటగాడు తాము ఎంచుకున్న ఆటలో అద్భుతంగా రాణించాలి అంటే ఇక సమర్థుడైన కోచ్ ఎంతో అవసరం అన్న విషయం తెలిసిందే. ఇలా కోచ్ గా ఉన్న వ్యక్తి తెలియని విషయాలను తెలియచేస్తూ ఆటగాడిని సన్మార్గంలో నడిపిస్తూ ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు.. తోడ్పాటు అందిస్తూ ఉంటాడు. సరైన కోచింగ్ ఉన్న ప్రతి ఆటగాడు కూడా సూపర్ సక్సెస్ అవడం చూస్తూ ఉంటాం. అయితే కోచ్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టే ఇప్పుడు భారత హెడ్ కోచ్గా ఎంపికైన గౌతమ్ గంభీర్ ఏం చేయబోతున్నాడు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.


 సాదరణంగానే గౌతమ్ గంభీర్ కాస్త అగ్ర సీవ్ మైండ్ సెట్ తో ఉంటాడు. అలాంటి గంభీర్ అటు టీమ్ ఇండియాను ఎలా ముందుకు నడిపించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టులో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి అన్నది తెలుస్తోంది. మొన్నటి వరకు కేవలం బ్యాటింగ్ కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్లకు ఇప్పుడు ఏకంగా బౌలింగ్ కూడా అప్పగిస్తున్నాడు. ఇక అతని కోచింగ్ లో భారత బౌలింగ్ బ్యాటింగ్ విభాగం ఎంతో దూకుడుగా కనిపిస్తోంది. రానున్న రోజులలో ఎవరైనా బౌలర్ గాయపడితే టీమిండియాలో లోటు ఏర్పడకుండా ఉండేందుకు ఇక అందరితో కూడా బౌలింగ్ చేయిస్తున్నాడు.


 అయితే రానున్న రోజుల్లో అటు గౌతమ్ గంభీర్ భారత జట్టులో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాడు అనే విషయంపై ప్రస్తుతం టెంపరరీ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సాయిరాజ్ బహుతులే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్న విషయాన్ని రివ్యూ చేశాడు. భారత జట్టును చూసి అన్ని టీమ్స్ వనికి పోయేలా చేయాలని అనుకుంటున్నాము అని చెప్పుకొచ్చాడు. టీమిండియా బ్యాటర్లలో బౌలింగ్ చేసే టాలెంట్ కూడా ఉందని.. దాన్ని మరింత సానపెట్టే పనిలో ఉన్నామని చెప్పుకోచ్చాడు. భవిష్యత్తులో టీమిండియానిపూర్తిగా మార్చేస్తామని ఆల్ రౌండ్ జట్టుగా తీర్చిదిద్దాలనేది మేనేజ్మెంట్ ప్లాన్ అంటూ చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లలో ఒకరిద్దరు బౌలింగ్ చేస్తే అది టీం కి ఎంత ప్లస్ పాయింట్ అవుతుంది. పిచ్ కండిషన్స్ మ్యాచ్ సిచువేషన్ ని బట్టి వాళ్ళకి బౌలింగ్ ఇవ్వాలా వద్ద  డిసైడ్ చేస్తామంటూ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: