టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ అందరికీ చాలా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ధోనీ కోహ్లీ ఇద్దరూ మ్యాచ్ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. తాజాగా ధోనీ తన కో-ప్లేయర్ విరాట్ కోహ్లితో ఆడటం ఎంతో సరదాగా అనిపించేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకరు అని ప్రశంసించారు. ధోనీ, కోహ్లి కలిసి భారత జట్టుకు ఎన్నో విజయాలను సాధించిపెట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ, తాను, విరాట్ ఎప్పుడు కలిసినా మాట్లాడుకుంటామని చెప్పారు.

"మేం ఇద్దరం చాలా కాలంగా భారత జట్టు కోసం ఆడాం. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. మేం కలిసి చాలా సార్లు మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేశాం. ఆ సమయంలో చాలా రెండు, మూడు రన్లు తీసుకునేవాళ్లం. అంటే మేము కలిసి ఆడటం చాలా ఆనందంగా, సరదాగా ఉండేది. మేం తరచుగా కలుసుకోం కానీ, కలిసినప్పుడు కొంత సేపు మాట్లాడుకుంటాము. క్రికెట్ ఆటలో ఏం జరుగుతుందో చెప్పుకుంటాం. మా మధ్య ఇంతే సంబంధం," అని ధోనీ చెప్పారు.

ధోనీ తన కెప్టెన్సీలో కోహ్లి 2008లో వన్డే, 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ధోనీ తర్వాత మూడు ICC వైట్-బాల్ ట్రోఫీలు గెలిచిన ఏకైక క్రికెటర్ కోహ్లి మాత్రమే!ధోనీ తన కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లిని జట్టులో చాలా ముఖ్యమైన ఆటగాడిగా తీర్చిదిద్దాడు. 2017లో జట్టు కెప్టెన్‌గా కోహ్లికి బాధ్యతలు అప్పగించాడు.

అలాగే, కోహ్లి కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ధోని కొన్నేళ్లు జట్టులో ఆడాడు. 2024 జూన్‌లో వెస్టిండీస్, యూఎస్‌ఏలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలిచింది. ఈ జట్టులో విరాట్ కూడా ఉన్నాడు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 59 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు.

ధోని 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున IPL క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. భారత్‌కు రెండో టీ20 ప్రపంచ కప్‌ను తెచ్చిపెట్టిన తర్వాత, విరాట్ టీ20 మ్యాచ్‌ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: