సాధారణంగా సెలబ్రిటీల సంపాదన అనేది కేవలం ఒక విధంగా మాత్రమే ఉండదు. వీళ్ళు తమ పాపులారిటీని ఉపయోగించుకొని బ్రాండ్ వ్యాల్యూ ఆధారంగా కోట్లలో డబ్బులు సంపాదిస్తుంటారు. స్పోర్ట్స్ సెలబ్రిటీల విషయానికి వస్తే క్రికెటర్లు ఎక్కువగా బ్రాండ్ వాల్యూ కలిగి ఉంటారు. అందుకే వారి సంపాదన కళ్లు చెదిరేలా ఉంటుంది. వీరితో ఇతర స్పోర్ట్స్ స్టార్స్ కూడా పోటీ పడుతుంటారు. తాజాగా క్రోల్స్ రిపోర్టు హై బ్రాండ్ వ్యాల్యూ కలిగిన టాప్-6 ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్  లిస్ట్‌ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఏకంగా 227.9 మిలియన్ల డాలర్లతో హైయ్యెస్ట్ బ్రాండ్ వ్యాల్యూ కలిగి ఉన్న ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ గా నిలిచాడు.

• ధోనీ

మిస్టర్ కూల్, స్ట్రాటజిక్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్రాండ్ వ్యాల్యూ 95.8 మిలియన్ డాలర్లుగా ఉంది. ధోనికి ఉన్న పాపులారిటీ ఏ క్రికెటర్ కు లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఆ రేంజ్ లో అతని బ్రాండ్ వ్యాల్యూ పెరిగిపోయింది. ధోని క్రికెట్ లెగసీ జియోసినిమా వంటి వాటికి ప్రచారం చేస్తున్నారు.

సచిన్ టెండూల్కర్  

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ చాలా ఏళ్లు అనేక కంపెనీలకు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ డబ్బులను ఆయన చాలా మంచి పనులకు విరాళంగా కూడా అందజేస్తున్నారు. అందుకే అతని బ్రాండ్ వ్యాల్యూ పెరిగిపోతూనే ఉంది ఇప్పుడు ఈ స్టార్ క్రికెటర్ బ్రాండ్ వ్యాల్యూ 91.3 మిలియన్ డాలర్లు.

రోహిత్ శర్మ

 టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఇండియాకు ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. ఎప్పుడూ పరుగుల వరద పారించే ఈ ప్లేయర్ కి మంచి బ్రాండ్ వ్యాల్యూ ఉంది. టి20 వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన తర్వాత ఇతని బ్రాండ్ వ్యాల్యూ 41 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

హార్దిక్ పాండ్యా  

 టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా బీభత్సమైన బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్నాడు. ఈ ఆటగాడు ఇతర క్రికెటర్లతో పోలిస్తే చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అందుకే ఫ్యాషన్ బ్రాండ్స్ అతనితో కలిసి తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటుంటాయి. యువతల పాండ్యాకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతని బ్రాండ్ వ్యాల్యూ 38.4 మిలియన్ డాలర్లకు చేరుకుంది. యు, టాకో బెల్ కంపెనీలకు ఈ ప్లేయర్ ప్రమోషన్స్ చేస్తుంటాడు.

నీరజ్‌ చోప్రా

సుబేదార్ నీరజ్‌ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావలిన్‌ త్రో ఆటలో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. భారతదేశానికి అతను బంగారు పతకాన్ని తెచ్చి పెట్టిన తర్వాత హీరో అయిపోయాడు. ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా మెడల్స్ కొట్టగలరు అని చాలామంది గొప్పగా కూడా చెప్పుకున్నారు. నీరజ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దాని కారణంగా అతని బ్రాండ్ వ్యాల్యూ కూడా చాలా పెరిగింది. నీరజ్‌ చోప్రాని స్టేజ్, అండర్ ఆర్మర్ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌కు ప్రమోటర్ గా  ఉన్నాడు. ఇప్పుడు ఈ ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్ బ్రాండ్ వాల్యూ అక్షరాలా 29.6 మిలియన్ డాలర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: