లైఫ్ లో సక్సెస్ సాధించాలి అంటే టైం కోసం ఎదురు చూడటం కాదు. టైం ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని చెబుతూ ఉంటారు ఎంతో మంది నిపుణులు. అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువకులు ఇలాంటిదే చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా క్రికెట్లో  కొంతమంది యువకులకు లక్కీగా వచ్చిన ఛాన్సులను వినియోగించుకుంటూ ఇక తమ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా ఎవరో స్టార్ ప్లేయర్ గాయపడితే ఊహించని రీతిలో లక్కీగా జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ క్రికెట్ గా మారిపోతున్నారు. అంతేకాదు సెలెక్టర్లు ఇక వారి ప్రదర్శనకు మెచ్చి తర్వాత కూడా ఇక వరుసగా చాన్సులు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది యువ క్రికెటర్ల విషయంలో ఇది జరిగింది. ఇక ఇప్పుడు మరో యంగ్ క్రికెటర్ ఇలాగే తన ప్రదర్శనతో అందరిని ఫిదా చేసేశాడు. ఇటీవల శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలు అయింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు ఓటమిని శాసించింది మాత్రం ఒక కుర్రాడు.


 లక్కీగా శ్రీలంక జట్టులో ఛాన్స్ దక్కించుకున్న ఆ కుర్రాడు ఏకంగా టీమ్ ఇండియాను చావు దెబ్బ కొట్టాడు. లంక స్టార్ ప్లేయర్ హస్సరంగా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో వచ్చి అద్భుతమైన చేసి చూపించాడు వాండర్సే. 2015లో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఈ 34 ఏళ్ల స్పిన్నర్ కు సరైన అవకాశాలు రాలేదు. 9 ఏళ్లలో 23 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ నిన్న బలమైన టీమిండియా పై ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అది కూడా భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లను ఔట్ చేసి ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: