ఈ క్రమంలోనే ఈ మార్పు చూసి గౌతమ్ గంభీర్ రావడం రావడమే అనూహ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టారు అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే గౌతమ్ గంభీర్ చేస్తున్న ఈ ప్రయోగాలు మాత్రం విఫలమవుతుండడం గమనార్హం. అటు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టును గంభీర్ ప్రయోగాలు దెబ్బ కొడుతున్నాయి. మొదటి మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ టై గా ముగిసింది. రెండో మ్యాచ్లో తప్పకుండా గెలుస్తుంది అనుకున్న టీమిండియా.. చివరికి ఓటమిపాలు అయింది. దీనికి అటు గౌతమ్ గంభీర్ చేసిన కొన్ని ప్రయోగాలు కారణమంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
గౌతమ్ గంభీర్ ఇప్పటివరకు తొలి రెండు మ్యాచ్ లలో శివం దుబేను ఆల్రౌండర్ గా దింపాడు. రియాన్ పరాగ్ కి అవకాశం ఇవ్వలేదు శివం దూబే మాత్రం ఏమాత్రం రాణించలేకపోతున్నాడు అని చెప్పాలి తొలి వన్డేలో పేలవమైన బ్యాటింగ్.. రెండో వన్డేలో డక్ అవుట్ ఇలా జట్టుకు భారంగా మారాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ ను తీసుకుని ఉంటే బాగుండేది అందరి అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రిషబ్ పంత్ కి బదులుగా కేఎల్ రాహుల్ కి ఛాన్స్ ఇచ్చాడు. దీనికి టీమిండియా పర్యావసనం చెల్లించుకుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇంకోవైపు సాఫీగా ఉన్న బ్యాటింగ్ ఆర్డర్లు ఎన్నో మార్పులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ ని టాప్ ఆర్డర్లోకి పంపుతున్నాడు కేఎల్ రాహుల్ శ్రేయస్ సైయర స్థానాల్లోనూ మార్పులు చేస్తున్నాడు శివం దూబే కూడా పదోన్నతి పొందిన.. రెండో వన్డేలో ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా గంభీర్ చేసిన ప్రయోగాలే టీమిండియాను దెబ్బ కొట్టాయి అంటూ ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.