భారత క్రికెట్ లో ఇటీవల అనూహ్యమైన మార్పులు జరిగాయి అన్న విషయం తెలిసిందే. భారత జట్టుకు టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ బాధ్యతలు చేపడితే.. ఇక ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో కొత్త కోచ్ గా టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యాడు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ కోచ్ గా భారత జట్టులో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు అనే విషయం పైన అందరిలో ఆసక్తి నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే కోచ్గా రావడం రావడమే ఇక ఎన్నో సంచలన మార్పులు చేస్తూ ఉన్నాడు గౌతమ్ గంభీర్  మొన్నటి వరకు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే కొనసాగిన ఆటగాళ్లతో ఏకంగా బౌలింగ్ కూడా వేయిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 గిల్, సూర్య కుమార్ యాదవ్, రింకు సింగ్ లాంటి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఇప్పటివరకు బౌలింగ్ వేశారు. మొన్నటికి మొన్న ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇలా బౌలింగ్ వేయడం చూసాము అన్న విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ ఇలా ప్రయోగాలు చేయడం బాగానే ఉంది  కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ప్రయోగాలు భారత జట్టునే దెబ్బకొడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటికి రెండో వన్డే మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితుల్లో కూడా టీమిండియా ఓటమిపాలై విమర్శలు ఎదుర్కొంటూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే భారత జట్టుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 అయితే ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగేందర్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు   ప్రతి విషయంలో ముక్కు సూటిగా ఉండే గౌతం గంభీర్ భారత హెడ్ కోచ్గా ఎక్కువ కాలం ఉండలేడని జోగేందర్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనకు అతనిపై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు  గౌతమ్ గంభీర్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనినైనా సరే నిజాయితీగా చేసే వ్యక్తి  అలాంటి వాళ్లకి కొన్ని కొన్ని సార్లు ప్లేయర్లతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో గౌతమ్ గంభీర్ నిర్భయంగా అన్ని మాట్లాడేస్తూ ఉంటాడు. అందుకే ఎక్కువ కాలం పాటు గౌతమ్ గంభీర్ కోచ్ గా  కొనసాగకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు జోగిందర్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: