టీమిండియాకు కోచ్గా ఇటీవలే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత భారత జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఊహించని ఘటనలు టీమ్ ఇండియాలో జరుగుతున్నాయి. మొన్నటి వరకు భారత జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగిన ఆటగాళ్లు ఇక ఇప్పుడు బౌలర్లుగా అవతారం ఎత్తుతున్నారు.



 అంతకుముందు జరిగిన టి20 సిరీస్ లో చివరి మ్యాచ్లో ఏకంగా ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతుండగా ఇక చివరి ఓవర్లో ఆరు పరుగులు కావాల్సి ఉన్నాయి. ఈ సమయంలో ఎవరు బౌలింగ్ వేస్తారా అని అందరు ఎదురు చూస్తుండగా.. మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది  అంతేకాదు పవర్ హిట్టర్ రింకు సింగ్, ఓపెనర్ గిల్ కూడా బౌలర్లుగా మారి బంతి విసిరారు. అయితే ఇటీవల జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇలా బౌలింగ్ వేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇలా గౌతమ్ గంభీర్ కోచ్ గా మారిన తర్వాత భారత జట్టులోని ప్లేయర్లు అందరికీ కూడా బౌలింగ్ ఇస్తూ ఉండగా ఇక ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మను సైతం బౌలర్గా మార్చేశాడు  రెండో వన్డే మ్యాచ్లో రెండు ఓవర్లు వేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే వికెట్ తీయకపోయినప్పటికీ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి పరవాలేదు అనిపించాడు. అయితే ఇలా జట్టులో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ కూడా బౌలింగ్ చేయడం టీం కి ఎంతో మేలు చేకూరుస్తుందని గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా బౌలర్ గాయపడినప్పుడు ఇలా పార్ట్ టైం బౌలర్లు జట్టుకు ఎంతో ఉపయోగపడతారని అనుకుంటున్నాడట గౌతమ్ గంభీర్

మరింత సమాచారం తెలుసుకోండి: