పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. ఇండియన్ యంగ్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. గురువారం పురుషుల 57 కేజీల క్వార్టర్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమన్ సెహ్రావత్ 12-0 తేడాతో విజయం సాధించాడు. అల్బేనియా ఆటగాడు జెలిమ్ ఖాన్ అబాకనోవ్‌పై నెగ్గాడు. దీంతో సెమీ ఫైనల్ లోకి అమన్ చేరిపోయాడు. ఫైనల్‌లో జపాన్‌కు చెందిన రీహిగుచితో అమన్ పోటీపడనున్నాడు. జపనీస్‌పై విన్ అయితే అమన్‌కు రజత పతకం రానుంది. ఒకవేళ ఓడితే మాత్రం బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది.

హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన అమన్ బీరోహార్ ప్రాంతానికి చెందిన ఓ యువ రెజ్లర్. 21 ఏళ్లలోనే ఇంటర్నేషనల్ లెవల్లో దూసుకుపోయి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మ్యాచులు ఆడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో అమన్ రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో బరిలో ఉన్నాడు. కెరీర్ పరంగా చూస్తే.. 2022 ఆసియా క్రీడల్లో అమన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే 2023లో కజకిస్తాన్ లోని అస్తానాలో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అమన్ గోల్డ్ మెడల్ సాధించాడు

అమన్ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. జాట్ కుటుంబానికి చెందిన అమన్ తన పదేళ్ల వయస్సులో తల్లిని పోగొట్టుకున్నాడు. ఏడాది తర్వాత తండ్రి కూడా మరణించాడు. చెల్లెలు పూజా సెహ్రావత్‌తో పాటు మేనమామ సుధీర్ సెహ్రావత్ ఇంటికి చేరాడు. ఆ తర్వాత రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్న అమన్.. కోచ్ లలిత్ కుమార్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. 2021లో తొలిసారి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు. 2024లో జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో అమన్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఒకేఒక్క భార‌త పురుష రెజ్ల‌ర్‌గా నిలవడం విశేషం. అమన్ సెమీస్‌కు చేరడంతో ఇండియాకు మరో మెడల్ ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: