పారిస్ ఒలంపిక్స్ లో భాగంగా అన్ని దేశాలు బంగారు పథకాలను గెలుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే.. ఇప్పటివరకు ఇండియా మాత్రం కేవలం కాంస్య పథకాలతో మాత్రమే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది అథ్లేట్లు పథకాలు సాధిస్తున్న.. అవి కేవలం కాశ్య పథకాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈసారి బంగారు పతకం వస్తే బాగుండు అని ఇండియాలోని ప్రతి ఒక్కరు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలోనే అటు స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ బంగారు పతకం పై ఆశలు కలిగించింది.


 సెమీఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ ను ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది. దీంతో తప్పకుండా భారత్కు అటు స్వర్నం వరిస్తుంది అని వినేష్ పొగట్ చరిత్ర సృష్టిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 100 గ్రాములు అధికంగా ఉండటం కారణంగా వినేష్ పొగట్ పై అనర్హత వేటు పడింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత అందరి ఆశలు ఒక్కడి పైకి వెళ్ళిపోయాయి. అతనే 2021 ఆగస్టు ఏడవ తేదీన ఒలంపిక్స్ లో ఇండియాకి స్వర్ణ పథకాన్ని అందించిన తొలి వీరుడు నీరజ్ చోప్రాపై. అప్పటివరకు భారతకు అసలు స్వర్ణ పథకమే లేదు.


 కలలో కూడా పసిడి ఊహ ఉండేది కాదు. కానీ ఆరోజు ఓ వీరుడు వచ్చాడు. బల్లెం పట్టుకుని పరుగెందుకున్నాడు. ఇక మెరుపు వేగంతో త్రో వేసి ఇక శతాబ్ద కాల స్వప్నాన్ని సహకారం చేశాడు. ఏకంగా ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని అందించి.. 130 కోట్ల భారతీయుల కలను నెరవేర్చాడు. అయితే ఇక ఇప్పుడు పారిస్ ఒలంపిక్స్ లో కూడా అతనిపైనే అందరు ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఫైనల్ చేరాడు. అయితే ఫైనల్ లో మాత్రం చివరికి రెండో స్థానంలో నిలిచి అటు సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. వరుసగా రెండు ఒలంపిక్స్ లలో రెండు పథకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. భారత క్రీడా ప్రపంచం ఎరుగని సరికొత్త  వీరుడు ఇప్పుడు సిల్వర్ మెడల్ గెలిచి మరోసారి తనను తాను ఈ క్రీడా ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: