ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. అయితే తాజాగా ఎమ్మెస్ ధోని పైన చీటింగ్ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ నిర్వహణలో భాగంగా ధోని పైన కేసు పెట్టడంతోపాటు.. ధోని తనను 15 కోట్ల మేరకు మోసం చేశారని ఉత్తరప్రదేశ్లోని ఆమేథిక్ చెందిన రాజేష్ కుమార్ మౌర్య బిసిసిఐకి సైతం ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అయితే బిసిసీఐ ఎథిక్స్ ప్రకారం 36 రూల్ కింద నమోదు చేసి ఆగస్టు 30వ తేదీ లోపల విచారణ ఇవ్వాలి అంటూ బీసీసీఐ ధోనీకి ఉత్తర్వులను జారీ చేసింది.


2017లో ఎమ్మెస్ ధోని పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఒక క్రికెట్ అకాడమీ సైతం నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సైతం ఒప్పందా కుదుర్చుకున్నదట. అయితే ఈ ఒప్పందం లోని షరతులను పాటించడంలో కంపెనీ విఫలమయ్యిందట... ఆర్కా  స్పోర్ట్స్ లో ఉన్నటువంటి సౌమ్య విశ్వాస్, నిఖిల్ దివాకర్ తో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ ఒప్పందం నుంచి ధోని సైతం వైదొలిగాడట...  2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్  ఇచ్చిన అథారిటీ లెటర్ ను ధోని రద్దు చేసుకోవడం జరిగిందట.


దీంతో ధోనికి 15 కోట్ల మేరకు రావాలని ఎన్నోసార్లు లీగల్ నోటీసు సైతం పంపించారట. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో ధోని రాంచి సివిల్ కోర్టును సైతం ఆశ్రయించారట. ప్రస్తుతం ఈ కేస్ అయితే విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా 43 ఏళ్ల ధోనినే తనను మోసం చేశారని.. ఆర్కా స్పోర్ట్స్ కి చెందిన రాజేష్ కుమార్ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ధోని పైన చీటింగ్ కేసు నమోదు అవ్వడంతో  ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారుతోంది. 2025 ఐపీఎల్ సీజన్లో ధోని ఆడుతాడా లేదా అని సందేహం ఉంటున్న సమయంలో ఈ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: