చాలా మంది తమ తండ్రులు చేసిన వృత్తిలోనే కొనసాగాలనుకుంటారు. అయితే అందులో కొందరు మాత్రం ఒకటి అనుకుని మరొకటి సాధిస్తుంటారు. అలాంటి కోవకు చెందినవాడే వెస్టిండీస్ క్రికెటర్ కొడుకు. పారిస్ ఒలింపిక్స్‌లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన రాయ్ బెంజమిన్ గురించి సర్వత్రా చర్చ నెలకొంది. తన తండ్రిలాగే అతను కూడా ఓ క్రికెటర్ కావాలనుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ లాగా రాణించాలనుకున్నాడు. అయితే తనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. పారిస్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్, 4×400 రిలేలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఒలింపిక్స్ పట్టికలో చైనాను మించి అమెరికా టేబుల్ టాపర్ ఉందంటే అందుకు కారణం అమెరికా అథ్లెట్ రాయ్ బెంజమిన్ మాత్రమేనని చెప్పాలి.

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్ స్టన్ బెంజమన్ కుమారుడే ఈ రాయ్ బెంజమిన్. విన్ స్టన్ 1987 నుంచి 1995వ ఏడాది వరకూ వెస్టిండీస్ క్రికెటర్‌గా రాణించాడు. పేస్ బౌలర్‌గా 21 టెస్టులు, 85 వన్డేలు ఆడాడు. రాయ్ కూడా తన నాన్నలాగానే ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. కానీ పరుగులో మాత్రం అతనికి మించి ఎవ్వరూ లేరని కోచ్‌కు తెలిసింది. దీంతో రాయ్‌ను ఫీల్డ్ మళ్లించారు. రన్నింగ్ రేసుల్లో కరీబియన్లకు సాటి ఎవరూ రారు. ఆ శరీరతత్వమే రాయ్‌కు ఉండటం వల్ల ఒలింపిక్స్‌లో దూసుకెళ్లాడు. అతను సాధించిన రెండు స్వర్ణాలు తండ్రి సొంత దేశానికి పెద్ద దెబ్బేనని చెప్పాలి. రాయ్ బెంజమిన్ అమెరికాలో పుట్టాడు. అందుకే అతను అమెరికన్ అయ్యాడు. అలా తను పుట్టిన దేశానికి రెండు స్వర్ణాలు అందించి స్టార్ అయ్యాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో రాయ్ సాధించిన విజయంపై ఆయన తండ్రి విన్ స్టన్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి అనుభూతి తనకు తొలిసారి అని, తన ఆనందం మాటల్లో చెప్పలేనని తెలిపారు. తన కొడుకు సాధించిన విజయం అద్భుతం అని కొనియాడారు. ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించడం సాధారణ విషయం కాదని, అది మాటల్లో చెప్పలేనని అన్నారు. తన కొడుకు రేస్ చూస్తున్నప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ చూసినంత భావోద్వేగం కలిగిందని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: