పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుంచి వెళ్ళిన వారు కచ్చితంగా పతాకం సాధిస్తారని అందరూ చాలా ఆశతో ఉండేవారు. ముఖ్యంగా బ్యాట్మింటన్ వరుసగా 2012 లో లండన్.. 2016లో రియో.. 2020లో టోక్యో ఒలంపిక్స్ లో పథకాలు రావడమే ఇందుకు ముఖ్య కారణమని చెప్పవచ్చు. లండన్ లో సైనా నెహ్వాల్ కాంస్యం తో సత్తా చాటింది. రియో లో రజతం, టోక్యోలో కాంస్య పతకంతో పీవీ సింధు కూడా గెలిచింది. అయితే ఈసారి మాత్రం ఒకటి కంటే ఎక్కువ పథకాలు వస్తాయని చాలామంది విశ్లేషకులు సైతం భావించారు.


హ్యాట్రిక్ పతాకం కోసం సింధు బరిలోకి నిలిచినప్పటికీ సింగిల్స్ తో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష సేన్ మంచి ఊపు మీద ఉండడంతో ప్రపంచ బ్యాడ్మింటన్  డబుల్స్ లో తిరుగులేని ఆధిపథ్యం కొనసాగించినటువంటి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కచ్చితంగా బంగారు పతకాన్ని సాధిస్తుందనీ అంచనాలు భారత్ ప్రజలకు పెరిగిపోయాయి. అంతేకాకుండా వీరికి కేంద్రం ప్రభుత్వం పెద్దపీట వేసింది.. ఒలంపిక్ పోడియం పథకం కింద 13 జాతీయ శిక్షణ శిబిరాలతో పాటు 81 విదేశీ పర్యటనలకు సైతం నిధులను సమకూర్చారట. పారిస్ సన్నాహాల కోసం ఏకంగా భారత క్రీడాప్రాదికార సంస్థ ఒలంపిక్ సెల్  కింద ఏకంగా 16 క్రీడల కోసం 470 కోట్ల రూపాయలు కేటాయించారట.


ముఖ్యంగా ఇందులో బ్యాట్మెంటన్ కు 72.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట.. అలాగే అథ్లెంటిక్స్ రూ.96.8 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇంత చేసిన కూడా బ్యాట్మింటన్ ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చేశాయి. లక్ష్య సేన్ తప్ప మిగతా వారంతా కూడా గోరంగా విఫలమయ్యారని చెప్పవచ్చు.. సింధు శిక్షణ కోసం ఏకంగా 3.13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. కానీ ఆమె ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. అలాగే సాత్విక్-చిరాగ్ జంట కూడా క్వార్టర్ ఫైనల్ లో పరాజయం అయ్యారు. వీరి కోసం ఏకంగా 5.62 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మహిళల డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టోకు రూ.1.5 కోట్లు ఖర్చు చేశారట. అలాగే ప్రణయ్ కోసం రూ.1.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుపుతున్నారు. ఇలా మొత్తానికి అందరూ కూడా నిరాశ పరిచారు. నాలుగేళ్ల తర్వాత 2028 లో లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ బరిలోకి ఎవరు దిగుతారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. 29 ఏళ్లు సింధు ఫిట్నెస్ కాపాడుకోవడం  కత్తి మీద సాము అనే చెప్పవచ్చు.. ఇక ప్రణయ్ ది కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.. ఇక లక్ష్య సేన్ పరిస్థితి కూడా ఇదే.. సాత్విక్, చిరాగ్ మీదే ఆశలన్నీ ఉన్నాయి. మరి లక్ష్య సెన్, చిరాగ్  లాస్ ఏంజెల్ లో తమ సత్తా చూపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: