టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అతను భారత జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టక ముందు నుంచే తన ఆట తీరుతో అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. అంతేకాదు భారత క్రికెట్ ప్రేక్షకులందరి చేత హిట్ మ్యాన్ అని పిలిపించుకున్నాడు. డబుల్ సెంచరీల వీరుడిగా, సిక్సర్ల ధీరుడుగా ఇక ఇండియన్ క్రికెట్లో రోహిత్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పాలి.


 ఇక టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతలా సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని ఫార్మాట్లలో కూడా టీమ్ ఇండియాను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఇక ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఏకంగా భారత జట్టును టైటిల్ విజేతగా నిలిపి వరల్డ్ కప్ గెలవాలి అనే కలను నెరవేర్చిన కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వన్డే, టెస్ట్ ఫార్మట్లలో మాత్రం భారత జట్టుకు కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే రోహిత్  కెప్టెన్గా తన లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.


 టీమిండియాను రికార్డులు ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కళ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇటీవల సియట్ అవార్డ్స్ లో పాల్గొన్న రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను. జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి.. అలాంటి జట్టును తయారు చేయడమే నా లక్ష్యం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా సియెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్ధను రోహిత్ శర్మ గెలుచుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: