టిమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరతో ఇప్పటికే వరల్డ్ క్రికెట్ కు తానేంటో నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తన బ్యాటింగ్ తో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు అని చెప్పాలి. ఇక అలాంటి విరాట్ కోహ్లీకి కేవలం క్రికెట్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏ క్రికెటర్ కి లేనంత మంది ఫాలోవర్లు అటు కోహ్లీ సొంతం అని చెప్పాలి.


 అందుకే విరాట్ కోహ్లీ గురించి ఏ వార్త బయటకు వచ్చినా కూడా.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్ర సివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆటలో ఏదైనా తప్పు జరిగింది అంటే చాలు అగ్గి మీద గుగ్గిలం లాగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే కోహ్లీలో ఉన్న ఇలాంటి అగ్రెసివ్ ఇంటెన్ట్ ఆటకు అవసరమని కొంతమంది అంటే.. ఇలాంటి అగ్రేసివ్ ఇంటెంట్  కొన్ని కొన్ని సార్లు భారత జట్టుకు మైనస్ గా మారిపోయింది అని ఇంకొంత మంది వాదిస్తూ ఉంటారు.


 అయితే కోహ్లీ దూకుడు తనం గురించి ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ ఫియోష్ చావ్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అండర్ 19 క్రికెటర్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఏం మారలేదు అంటూ పియూస్ చావ్లా చెప్పుకొచ్చాడు. అండర్ 19  క్రికెట్ నుంచి కోహ్లీ నేను మంచి మిత్రులం. అయితే కోహ్లీ ఇంతటి స్టార్ క్రికెటర్ గా ఎదిగిన తర్వాత కూడా ఇంకా 15 ఏళ్ల క్రితం లాగే ఉన్నాడు. మా స్నేహ బంధం ఎప్పటిలాగే బాగుంది. ఆసియా కప్ సమయంలో నేను కామెంట్రీ చేస్తున్నప్పుడు.. అతడు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. మధ్యలో నా దగ్గరికి వచ్చి పిసి.. తినడానికి ఏమైనా ఆర్డర్ ఇద్దాం అనేసాడు. అయితే అప్పట్లో కూడా మేము ఇలాగే ఉండేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు పీయూష్ చావ్లా .

మరింత సమాచారం తెలుసుకోండి: