వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అటు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆరంభించేందుకు సిద్ధమవుతుంది భారత జట్టు.  ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత సుదీర్ఘమైన ఫార్మాట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టు సిరీస్ ఆడుతూ ఉండడంతో ఈ సిరీస్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మరికొన్ని రోజులలో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుండగా.. భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన బంగ్లాదేశ్ పై ఎలా ఉంది అన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


 ఈ క్రమంలోనే భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు బంగ్లాదేశ్ పై చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. ఇక రోహిత్ గణాంకాలు చూసి ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టుల్లో రోహిత్ రికార్డు చాలా నిరాశ పరుస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఇకపోతే రోహిత్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2024లో టెస్టుల్లో మొత్తం 11 ఇన్నింగ్స్ లు ఆడి 450 పరుగులు చేశాడు రోహిత్.


 ఇలా రోహిత్ కెరియర్ మొత్తం టెస్టులలో గణాంకాలు బాగానే ఉన్నప్పటికీ ఒక్క బంగ్లాదేశ్ తో మాత్రం రోహిత్ అత్యుత్తమ గణాంకాలు మాత్రం నమోదు చేయలేకపోయాడు అని చెప్పాలి. ఇప్పటివరకు బంగ్లాదేశ్ తో జరిగిన మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్లలో రోహిత్ శర్మ 11 సగటుతో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సిరీస్ లో రోహిత్ సత్తా చాటుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా రోహిత్ ఇప్పటివరకు భారత్ లో 29 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 45 ఇన్నింగ్స్ ల సహాయంతో 2402 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ సగటు 61.59గా ఉంది అని చెప్పాలి. అంతా బాగానే ఉన్నా ఇలా బంగ్లాదేశ్ తో జరిగే టెస్టుల్లో మాత్రం రోహిత్ కి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లు లేకపోవడంతో ఈసారి ఏం చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: