2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అటు బీసీసీఐ అని ఏర్పాట్లు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మెగా వేలం జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే 10 జట్ల యాజమాన్యాలతో బీసీసీఐ సమావేశం కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే ఎంతమంది ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునేందుకు అవకాశం ఉంది అనే విషయంపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది అన్నది తెలుస్తుంది.


 అయితే మెగా వేలం ఉన్న నేపథ్యంలో మొన్నటి వరకు కేవలం ఒకే జట్టు తరఫున ఏళ్ల తరబడి ఆడుతున్న ఆటగాళ్లు జట్టు మారే అవకాశాలు ఉన్నాయని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎంతోమంది నిపుణుల సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తుంది బీసీసీఐ అనేది తెలుస్తుంది. ఇలాంటి సమయంలో అటు ఐపిఎల్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతున్నాయ్. గత ఏడాది కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ ఆ జట్టును వేరే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కొత్త కెప్టెన్ హార్దిక్ ని కూడా సారధ్య బాధ్యతల  నుంచి తప్పిస్తారని సూర్యకుమార్కు కెప్టెన్సీ అప్పగిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.


 అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ జట్టు స్టార్ కేసీఆర్ బుమ్రా ఇక ఇప్పుడు కెప్టెన్సీ దక్కదు అని భావించి జట్టును వీడబోతున్నాడు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఫేస్ బౌలర్లు కెప్టెన్ గా సక్సెస్ సాధించారని పలుమార్లు బుమ్రా వ్యాఖ్యానించాడు. దీన్ని బట్టి చూస్తే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ దక్కుతుందని బుమ్రా ఆశలు పెట్టుకున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం భారత జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ చేతికి సారధ్య బాద్యతలు వెళ్ళే అవకాశాలు ఉండడంతో.. ఇక బుమ్రా ఏకంగా ఆర్సిబి జట్టులోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడట. ఎన్నో రోజులుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సిబి గేమ్ చేంజర్ అయిన బుమ్రాను తీసుకోవాలని అనుకుంటుందట. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: