సాధారణంగా ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎవరైనా ఆటగాడు ఒక్కసారి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు అంటే చాలు ఇక వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక వారి గురించి తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.


 అయితే ఇక ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆటగాళ్ల ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం గతంలో టీమిండియా తరఫున చాలా మ్యాచ్ లు ఆడాడు. కానీ ఇప్పుడు ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా ఇప్పుడు ఏకంగా పెట్రోల్ పంపులో పని చేస్తూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టీమిండియా స్టార్ స్పిన్నడు చాహల్ ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా నవ్వుకుంటున్నారు.


 ఎందుకంటే ఈ వీడియోలో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ పృథ్వి షా ఏకంగా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ కనిపించాడు. ప్రస్తుతం చాహల్ పృథ్వి షా ఇంగ్లాండులో కౌంటి క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పృద్వి షా పెట్రోల్ పంప్ వద్ద కారులో ఇంధనాన్ని నింపుతున్నట్లు కనిపించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో చూసి నేటిజన్స్ నవ్వుకుంటున్నారు. ఎప్పుడు చిలిపి పనులు చేసే చాహల్ మరోసారి తన మొబైల్ కెమెరాకు పని చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలీ. కాగా గత కొంతకాలం నుంచి ఫామ్ కోల్పోయిన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు  పృథ్వి షా. దీంతో టీం ఇండియాలో చోటు లేకపోవడంతో పృద్విషా పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడా ఏంటి అని కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: