2025 ఐపీఎల్ కోసం అన్ని టీమ్స్ కూడా సిద్ధమవుతున్నాయ్. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ సీజన్ కి ముందు మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా వేలంలో ఏ ఆటగాళ్లను వేలంలోకి వదిలేయాలి. ఎవరిని జట్టులోకి తీసుకోవాలి అనే విషయంపై అన్ని ఫ్రాంచైజీలు కూడా పక్క ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలం కోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా ఐదుగురు ఆటగాల్లను వేలంలోకి వదిలేసేందుకు సిద్ధమైందట. ఇక వారిని మళ్లీ కొనుగోలు చేయాలని కూడా అనుకోవట్లేదట. ఆ లిస్ట్ చూసుకుంటే..

 శార్దూల్ ఠాగూర్  : ముంబై కి చెందిన ఆల్రౌండర్ శార్దూల్ ఠాగూర్ గత సీజన్లో తొమ్మిది మ్యాచ్లలో ఐదు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. అయితే ఇతని కోసం ఏకంగా సీఎస్కే 5 కోట్లు ఖర్చు పెడుతుండగా.. ఇతన్ని వదులుకోవాలని అనుకుంటుందట.

 మోయిన్ అలీ : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. 8 మ్యాచ్లలో 128 పరుగులు చేసి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతని వదులుకోవాలని సీఎస్కే అనుకుంటుందట.

 డారిల్ మిచేల్  : ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ పై భారీ నమ్మకం పెట్టుకుని 14 కోట్లకు జట్టులోకి తీసుకుంది. కానీ ఇతను 318 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో ధోని ఇతన్ని వదులుకోవాలని సలహా ఇచ్చాడట.

 దీపక్ చాహర్  : ఇతన్ని వేలంలో భారీ ధరకు దక్కించుకుంది సీఎస్కే. కానీ అతను గాయం కారణంగా తరచు జట్టుకు దూరమవుతూ ఉండడం.. ఇక జట్టులోకి పునరాగమనం చేసిన పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో అతని పక్కన పెట్టాలని అనుకుంటుందట.

 అజింక్య రహానే  : ఇతని కేవలం 50 లక్షలకే జట్టులోకి తీసుకున్నప్పటికీ మ్యాచ్ విన్నర్ అవుతాడు అనుకుంటే జట్టుకు భారంగా మారిపోతున్నాడు. 2024 సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతని వదులుకోవాలని సీఎస్కే అనుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: