టీమిండియా ఆటగాడు పృథ్వీ షా కష్టాల్లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. తాజాగా పృథ్వీ పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ కెమెరా కంటపడ్డాడు. పృథ్వీ కి స్టార్ ఓపెనర్ గా మంచి పేరు ఉంది. అయితే పృథ్వీ 2021 జులై నుంచి టీమ్ ఇండియాకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం పృథ్వీ, యుజ్వేంద్ర ఇంగ్లాండ్ దేశంలో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర తన ఇన్ స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసుకున్నాడు.


ఇందులో పృథ్వీ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్లుగా కనిపించాడు. ఒక కారులో ఇంధనం నింపుతున్న వ్యక్తిగా కనిపించాడు. దీంతో పృథ్విని అలా చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. టీమిండియాకు మూడు సంవత్సరాల నుంచి పృథ్వీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నారు. ఇంతకు మించిన దారుణం ఇంకేమైనా ఉంటుందా అని వ్యాఖ్యానిస్తున్నారు. పృథ్వి ప్రస్తుతం కౌంటీ క్రికెట్ లో తన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు.


టీమిండియాలో పునరాగమనం చేసేందుకు సాహసాలు చేస్తున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజుల్లో పృథ్వీ అద్భుతంగా ఆడాడు. దీంతో పృథ్విని అందరూ దిగ్గజ ఆటగాళ్లతో పోల్చారు. ఆ తర్వాత పృథ్వీ తన ఫామ్ కోల్పోయాడు. ఫలితంగా జట్టుకు దూరమయ్యారు. ఇక 2013లో పృథ్వీ ముంబై జట్టుతో జరిగిన ఒక క్లబ్ మ్యాచ్లో 500 కు పైగా స్కోర్ చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.


టీమిండియా అండర్-19 ప్రపంచకప్ సాధించింది. ఆ తర్వాత అతడికి టీమిండియాలో స్థానం లభించింది. అయితే అతడు ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. దీంతో పృథ్వీ జట్టుకు దూరమయ్యాడు. ఇక అప్పటి నుంచి టీమిండియాలో పృథ్వీ షా కు ఛాన్స్‌ రాలేదన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టీమిండియా ఆటగాడు పృథ్వీ షా  పెట్రోల్‌ బంక్ లో కనిపించడం కొత్త చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: