క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు  ఎందుకంటే అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ తన ఆట తీరుతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. ఇండియన్ క్రికెట్ కి దేవుడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ సచిన్ సాధించిన ఎన్నో రికార్డులు పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి.


 ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో ఎన్నో పటిష్టమైన రికార్డులను నెలకొల్పి చరిత్ర పుటల్లో తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది స్టార్ ప్లేయర్లు సచిన్ సాధించిన కొన్ని రికార్డులను బద్దలు కొడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా సచిన్ సాధించిన ఒక రికార్డు బద్దలైంది. అయితే సచిన్ రికార్డు బ్రేక్ అయింది అంటే ఎవరో స్టార్ క్రికెటర్ ఈ రికార్డును బ్రేక్ చేసి ఉంటాడు అని అనుకుంటారు ఎవరైనా. మీరు కూడా అలా అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సచిన్ రికార్డును బ్రేక్ చేసింది క్రికెటర్ కాదు.


 అసలు ఆయనకు క్రికెట్ తో సంబంధమే లేదు  అయినప్పటికీ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటి అని కన్ఫ్యూషన్ లో ఉన్నారు కదా. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులను ఢిల్లీకి చెందిన వినోద్ కుమార్ చౌదరి బ్రేక్ చేశాడు  సచిన్ పేరిట 19 గిన్నిస్ రికార్డులు ఉండగా.  టైపింగ్ లో వినోద్ 20 గిన్నిస్ రికార్డులను నెలకొల్పాడు. 20వ గిన్నిస్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సచిన్ చేతుల మీదుగా అందుకోవాలని ఆశపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. కళ్ళకు గంతలు కట్టుకొని ఐదు సెకండ్లలో బ్యాక్ వర్డ్ టైపింగ్ చేసి ఆయన ఈ రికార్డులు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: