టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు కేఎల్ రాహుల్. వికెట్ కీపర్ గా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా సేవలు అందిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి జట్టుకు దూరమైనప్పటినుంచి కూడా  రాహుల్ ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకొని ఎంతో సమర్థవంతంగా ఇక ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం అతను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటంతో.. ఇక అతని స్థానంలో మరొకరిని జట్టులోకి తీసుకోవడం చేస్తూ వస్తున్నారు సెలెక్టర్లు.


 అదే సమయంలో రోహిత్ శర్మ తర్వాత కేఎల్ రాహుల్ ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడు అని అందరూ అనుకున్నప్పటికీ.. ఊహించని రీతిలో అతనికి చేదు అనుభవాలు ఎదురవుతూ వస్తున్నాయి. ఇక కెప్టెన్  అవడం కాదు కనీసం జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి జట్టులో చోటు కల్పించినప్పటికీ.. అతను మాత్రం ఇక వరుసగా విఫలం అవుతూ చివరికి జట్టులో స్థానం కోల్పోతూనే ఉన్నాడు. ఇటీవల కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ కాస్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి.


 ఏకంగా కేఎల్ రాహుల్ ఇంత తక్కువ వయస్సులోనే రిటైర్మెంట్కు సిద్ధమయ్యాడా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. కోహ్లీ, రోహిత్ తర్వాత ఆ లెవెల్ లో కి వెళ్లిన ఆటగాడిగా గుర్తింపును సంపాదించుకున్న కేఎల్ రాహుల్ మొన్నటికి మొన్న జరిగిన శ్రీలంకతో వన్డే సిరీస్ లో కూడా విఫలమయ్యాడు. దీంతో త్వరలో బంగ్లాదేశ్ లో జరగబోయే సిరీస్ లో అతను ఆడతాడా లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇలాంటి సమయంలో ఇక కేఎల్ రాహుల్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ అందరిని ఆలోచింపచేస్తుంది. నిరాశతో కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ఆలోచన ఏమైనా చేశాడా ఏంటి అని అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏం జరగబోతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: