టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు. క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించారు క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌.. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు శిఖర్ ధావన్ శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటన చేశాడు శిఖర్‌ ధావన్‌. అభిమానుల కోసం ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసి... రిటైర్ అవుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ శిఖర్‌ ధావన్‌.


ధావన్ చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అయితే, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్ ధావన్ గత రెండేళ్లలో శుభ్‌మన్ గిల్, ఇతర యువ ఓపెనింగ్ బ్యాటర్‌ల కారణంగా తన స్థానాన్ని కోల్పోయాడు. దేశం కోసం ఆడటం నా కల.. నిజమైందని తన రిటైర్మెంట్‌ ప్రకటన వీడియోలో తెలిపారు శిఖర్ ధావన్.  ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది..


నాకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌లకు, బీసీసీఐకి, డీడీసీఏకి కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్‌ అయ్యారు శిఖర్ ధావన్.  ఇక శిఖర్‌ ధావన్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. టీమిండియా తరపున 34 టెస్టులు ఆడి 2315 రన్స్ చేశాడు ధావన్‌. అటు 167 వన్డేలు ఆడి 6793 రన్స్ చేశాడు ధావన్‌. 68 టీ20 లు ఆడి 1759 రన్స్ చేశాడు ధావన్‌.

ఇక తాజా ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శిఖ‌ర్ ధావ‌న్.. రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. భుజం గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడని మనకు తెలిసిందే. దీంతో ధావన్ స్థానంలో సామ్ క‌ర‌న్‌కు కెప్టెన్సీ దక్కింది. గాయం నుంచి కోలుకున్నా ధావన్ ను పక్కన పెట్టింది పంజాబ్ టీం. అతని అత్యుత్తమ 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతను 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. అతను తన 2315 టెస్ట్ పరుగులకు 40.61 సగటుతో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: