సాధారణంగా సెలబ్రెటీల డేటింగ్, లవ్, అఫైర్స్, పెళ్ళిలో విడాకులు ఎప్పుడూ మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఇక ఒక సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుందంటే వారి గురించే చాలా రోజులు మాట్లాడుకుంటారు. ఎందుకు విడాకులు తీసుకున్నారు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు ఇలా రకరకాల చర్చలు చేస్తుంటారు. ఇక ఇటీవల  బాలీవుడ్ యాక్ట్రెస్ నటాషా స్టాంకోవిచ్‌, స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం కూడా భారతదేశం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే వారిద్దరి పర్సనాలిటీస్ ఒకరితో ఒకటి సరిపడకపోవడమే వారి విడాకులకు కారణమని తాజాగా సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ జంటకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు మాట్లాడుతూ "హార్దిక్ చాలా షో ఆఫ్ చేసేవాడు, తన గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. నటాషా దీన్ని భరించలేకపోయింది. అందుకే విడాకులు తీసుకుంది." అని తెలిపారు. హార్దిక్ అతిగా షో చేస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. మంచి ఆటగాడు, మంచి మనస్తత్వం ఉన్నవాడే కానీ ఎక్కువ ఆటిట్యూడ్ ఉంటుంది ఇది చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా నచ్చదు. నటాషా అతడి నుంచి విడిపోవడానికి కూడా ఇదే కారణం అని ఇప్పుడు సన్నిహిత వర్గాలు పేర్కొనడం సంచలనంగా మారింది.

వాస్తవానికి నటాషా తమ పెళ్లి బంధంలో సామరస్యాన్ని పెంచడానికి ఎంతో ప్రయత్నించిందట, కానీ వారి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు మరింత పెరిగిపోయాయి. పాండ్యా మాజీ భార్య మొదట్లో భిన్నమైన స్వభావాలను అంగీకరించి, సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించింది. కానీ తరువాత, హార్దిక్‌ను మార్చాలని ప్రయత్నించింది. అయితే, తమ పర్సనాలిటీలు ఎంతగానో భిన్నంగా ఉన్నాయని, ఈ వివాహాన్ని కొనసాగించడం కష్టమని చివరకు ఆమెకు అర్థమైందట.

నటాషా ఇద్దరికీ మంచి జరగాలంటే విడిపోవడమే మంచి నిర్ణయమని భావించింది. ఈ నిర్ణయం తీసుకోవడం ఆమెకు చాలా కష్టమే అయినప్పటికీ, తన ఆరోగ్యం కోసం, తన కుమారుడు అగాస్త్య కోసం ఇది అవసరం అని నిర్ణయించుకుంది. దీంతో నటాషా తన కుమారుడితో కలిసి తన స్వదేశమైన సెర్బియాకు వెళ్లిపోయింది. హార్దిక్ పాండ్యా జులైలో సోషల్ మీడియా ద్వారా వారు విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. వారి అభిమానులకు ఇది చాలా నిరాశ కలిగించే విషయమని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: