ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంటే అభిమానులు ఎంత ఆసక్తిగా చూస్తారో బంగ్లాదేశ్-పాక్ మ్యాచ్ జరిగినా అలానే చూస్తారు. పాక్ జట్టును మట్టికరిపించేందుకు బంగ్లా క్రికెట్ టీమ్ పడే శ్రమ అంతా ఇంత కాదు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెట్ హిస్టరీలోనే ఆగస్టు 25న ఓ రికార్డు క్రియేట్ అయ్యింది. రావల్పిండి టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి బంగ్లాదేశ్ జట్టు పాక్ పై విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0తో ముందంజలో ఉంది. ఆగస్టు 30న రెండో టెస్ట్ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానుల కన్నుపడిందని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది.

రావల్పిండి టెస్ట్ మ్యాచ్ నుంచి మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను టీమ్ నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు కూడా అందాయి. షకీబ్ అల్ హసన్ ఈ మధ్యనే ఓ హత్యలో పాల్గొన్నట్లుగా ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్ ఉద్యమం జరుగుతుండగా ఓ విద్యార్థిని ఆయన కాల్చి చంపాడని ఢాకాలో ఎఫ్ఐఆర్ ఉంది. షమీల్‌తో సహా మరో 147 మందిపై ఆరోపణలున్నాయి. ఐసీసీ కూడా ఈ విషయంపై స్పందించింది. లీగల్ నోటీసులను కూడా పంపింది.

అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ దీనిపై మాట్లాడుతూ..ఆగస్టు 30న రావల్పిండిలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో షకీబ్‌పై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. బోర్డు డైరెక్టర్లతో మాట్లాడి షకీబ్ రాబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టులో ఉంటాడా? ఉండడా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వాస్తవానికి షకీబ్ పాక్ సిరీస్‌కు ముందు విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా పాక్‌కు చేరుకుని మ్యాచ్‌లో పాల్గొన్నాడు. బంగ్లాదేశ్ శిబిరంలో షకీబ్ పాల్గొనలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పాక్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో షకీబ్ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీసి రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లను పడగొట్టాడు. పాకిస్థాన్ జట్టును ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: