ఇండియాలో క్రికెట్ కి ఎంత విపరీతమైన క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి.. టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఇంకొంతమంది కాస్త ఖర్చు అయినా పర్వాలేదు. కానీ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  ఇక క్రికెటర్లను ఏకంగా దైవంలాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు.


 అయితే ఇలా అమితంగా అభిమానించే క్రికెటర్లు ఎవరైనా తమ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు అంటే అభిమానులు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోతూ ఉంటారు. ఇక వారి ఆటను చూడలేమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఎంతో మంది ఆటగాళ్లు వివిధ లీగ్ లలో ఆడుతూ ఉండడం చూస్తూ ఉన్నాము. అయితే ఇటీవల టీం ఇండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో ఛాన్సులు దక్కించుకోలేకపోతున్న ధావన్ ఇలా రిటైర్మెంట్ ఆలోచన చేశారు.


 ఇలా ఈనెల 24వ తేదీన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించగా.  మళ్లీ గబ్బర్ ఆటను చూడలేమేమో అని అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు గబ్బర్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అందింది. ఎందుకంటే మరోసారి శిఖర్ ధావన్ బ్యాట్ పట్టబోతున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆయన భారత లెజెండ్స్ జట్టు తరఫున ఆడబోతున్నాడు  సెప్టెంబర్ లో జరిగే ఈ లీగ్ లో ఆడేందుకు గబ్బర్ ఇప్పటికే జట్టుతో కలిశాడు అన్నది తెలుస్తోంది. కాగా క్రికెట్ ఆడెందుకు తన శరీరం ఇంకా సిద్ధంగానే ఉంది అంటూ దావన్  చెప్పుకొచ్చాడు. క్రికెట్ తనలో ఒక భాగమని.. దానిని వేరు చేయడం కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: