2025 ఐపీఎల్ మెగా వేలానికి అంత సిద్ధమవుతుంది  ఇప్పటికే బీసీసీఐ ఇందుకు సంబంధించిన అనేక ప్రణాలికలను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అటు అన్ని ఫ్రాంచైజీ ఓనర్లతో కూడా చర్చలు కూడా పూర్తి చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో మెగా వేలం డేట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు జరిగే మెగా వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్లబోతున్నాడు అనే విషయంపై ప్రస్తుతం ఇండియా క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఏ టీం ఏ ఆటగాడిని వేలంలోకి వదిలేయబోతుంది అనే విషయంపై కూడా ఎంతోమంది మాజీ ప్లేయర్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.


 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచి ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇక ఈసారి ఏకంగా ముగ్గురు స్టార్ ప్లేయర్లను వేలంలోకి వదిలేయాలని అనుకుంటుందట. వాళ్ళు ఎవరో చూసుకుంటే..


 గిరాల్డ్ కోఎడ్జి  : ఇండియా వేదికగా జరిగిన వండే వరల్డ్ కప్ 2023లో 8 మ్యాచ్ లు 20 వికెట్ల తీసి సత్తా చాటిన ఇతన్ని ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ముంబై. ఈ ఏడది జరిగిన ఐపీఎల్ లో పది మ్యాచ్ల 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. కానీ మెగా వేలం నేపథ్యంలో నలుగురు ఐదుగురు ఆటగాళ్లని రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉండడంతో.. అతని వదులుకోవాలని ముంబై ఇండియన్స్ అనుకుంటుందట. బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లను అంటి పెట్టుకోవాలని నిర్ణయించుకుందట.


 నేహాల్ వదేరా  : ముంబై ఇండియన్స్ తరఫున నేహాల్ వదెరా అద్భుతమైన ప్రదర్శన కన పరిచాడు. 20 మ్యాచ్లాడి 350 పరుగులు చేశాడు. 2023 సీజన్లో కాస్త తడబడిన 2024 సీజన్లో మాత్రం సత్తా చాటాడు. దీంతో అతని వదులుకోవాలని ముంబై ఇండియన్స్ కు లేకపోయినా.. మెగా వేలంలో రూల్స్ కారణంగా అతన్ని వేలంలోకి వదిలేయాలని అనుకుంటుందట.


 రోహిత్ శర్మ : కెప్టెన్గా ముంబై ఇండియన్స్ కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ ను కూడా ఆ జట్టు యాజమాన్యం వదులుకోబోతుందట. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతను జట్టు యాజమాన్య పై అసంతృప్తితో ఉన్నాడని దీంతో రోహిత్ శర్మే అటు ముంబై ఇండియన్స్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో జట్టు కూడా అతన్ని వేలంలోకి వదిలేయాలని నిర్ణయించుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: