టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియాలోనే కాదు తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించి నేటి తరానికి తనను మించిన ఎజెండరీ క్రికెటర్ మరొకరు లేరు అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ కూడా మూడు ఫార్మాట్లలో కూడా కొనసాగుతూ టీమ్ ఇండియాలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు.


 అయితే ప్రస్తుతం భారత జట్టులో కేవలం స్టార్ ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గతంలో భారత జట్టు కెప్టెన్ గా కూడా ఎన్నో ఏళ్ల పాటు సారధిగా జట్టును ముందుకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతని కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా సాధించింది. ఇలా ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియా కోహ్లీ కెప్టెన్సీలో ఎన్నో అరుదైన విజయాలు సాధించినప్పటికీ.. వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి మెగాటోర్నీలు గెలవడంలో మాత్రం విఫలమైంది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్లు రావడంతో.. కోహ్లీ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.


 అయితే విరాట్ కోహ్లీ ఇలా అర్థంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పై భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ని వదులుకోవాల్సింది కాదు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇంకొంత కాలం పాటు కెప్టెన్సీలో కొనసాగి ఉంటే బాగుండేది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 2014లో ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న విరాట్ కోహ్లీ 68 టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించాడు. 40 విజయాలతో సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. 2022 తన టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: