2025 ఐపీఎల్ సీజన్ గురించి ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఎక్కడ చూసిన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అటు మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మెగా వేలం నేపథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి వెళ్లే అవకాశం ఉంది. అన్ని ఫ్రాంచైజీలు కూడా కేవలం కొంతమంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని.. మిగతా ఆటగాళ్లు అందరిని కూడా తప్పనిసరిగా వేలంలోకి వదిలేయాల్సి ఉంటుంది.


 దీంతో ఐపీఎల్ లోనే అన్ని టీమ్స్ లో కూడా ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మెగా వేలం కోసం ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ లోని అన్ని ప్రాంచైజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ మరికొన్ని రోజుల్లో మెగా వేలం డేట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మెగా వేలం నేపథ్యంలో కొన్ని టీమ్స్ యాజమాన్యాలు ఇక తమ జట్లకు కొత్త కెప్టెన్లను నియమించుకునేందుకు సిద్ధమయ్యాయి అన్నది తెలుస్తుంది. అయితే లక్నో కెప్టెన్గా కొనసాగుతున్న కే.ఏల్ రాహుల్ ఆ జట్టు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ఇక జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ ను నియమించుకునేందుకు రెడీ అయ్యిందట.


 ఈ క్రమంలోనే తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ నన్ను లక్నో ఫ్రాంచైజీ నియమించనున్నట్లు సమాచారం. అతనితో పాటు కృనాల్ పాండ్యా పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే సీజన్ కోసం కేఎల్ రాహుల్ ను రిటైన్ చేసుకోవాలని అటు లక్నో నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ కెప్టెన్ గా కాకుండా కేవలం జట్టులో స్టార్ ప్లేయర్గా మాత్రమే కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు కేఎల్ రాహుల్ లక్నోలో కొనసాగేందుకు పెద్దగా ఆసక్తిగా లేడని.. ఇక వేలంలోకి వచ్చి మరో టీంలోకి వెళ్లి.. అక్కడికి కెప్టెన్సీ చేపట్టాలని అనుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: