అయితే ఒకప్పుడు టీం ఇండియాకు రెగ్యులర్ ఓపనర్ గా, విధ్వంసకర ఆటగాడిగా కొనసాగిన శిఖర్ ధావన్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ఓపెనర్గా సేవలు అందించిన శిఖర్ ధావన్ ఆ తర్వాత యువ ఆటగాళ్ల రాకతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే చాలా రోజులపాటు జట్టులో చోటు దక్కుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురుచూసినా.. నిరాశ తప్పలేదు. దీంతో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు గబ్బర్. ఈ క్రమంలోనే కేవలం దేశవాళీ క్రికెట్లో మాత్రమే కొనసాగుతాను అన్న విషయాన్ని స్పష్టం చేశాడు.
ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ కెరియర్ ఎలా సాగింది అన్న విషయం గురించి భారత క్రికెట్ ప్రేక్షకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ధావన్ కెరియర్ మొత్తంలో అతని ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏంటి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గబ్బర్. 2017 వన్డే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకము అంటూ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు చేతికి గాయమైన అలాగే ఆటను కొనసాగించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో దవన్ 137 పరుగులు చేయగా.. భారత జట్టు 130 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది.