ఏ క్రీడలో అయినా సరే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే అందులో కచ్చితంగా వ్యక్తికి గాని, లేకపోతే టీం అంతటికి కలిపి ఒక కోచ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆటగాడు ఎంత నైపుణ్యం కలిగి ఉన్న.. సీనియర్ కోచ్ ఉంటేనే అతడు అంతర్జాతీయ మ్యాచుల్లో రాణించడానికి తగిన సూచనలు ఇస్తూ ఆటగాళ్లని విజయం వైపు నడిపిస్తాడు. ఇకపోతే భారతదేశంలో ఎక్కువగా ఆడే క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ మాత్రమే. ఇకపోతే టీమిండియా ఆటగాళ్లు ఇతర దేశాల క్రికెట్ జట్లకి కోచింగ్ చేశారు. అది ఈ విషయం చాలామందికి తెలియదు. మరి ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దామా..

ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది సందీప్ పటేల్. ఈయన 1983 వన్డే ప్రపంచ కప్ ను భారత్ కు అందించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఈయన తన రిటైర్మెంట్ తర్వాత కెన్యా క్రికెట్ జట్టుకు కోచ్ గా పనిచేశారు. ఆయన కోచ్ గా ఉన్న సమయంలో కెన్యా 2003 వరల్డ్ కప్ లో ఏకంగా సెమీఫైనల్ కు చేరుకుంది. అంతేకాదు ఆయన ఇదివరకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది.

ఈ లిస్టులో మరో ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్. ఈయన 2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా టీం పై అరంగ్రేటం చేయగా.. టీమిండియా తరఫున కేవలం ఎనిమిది ODI లు మాత్రమే ఆడగలిగాడు. ఆ తర్వాత ఆయన ఆరు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా జట్టుతో స్పిన్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించారు. 2022 లో ఆయన ఆస్ట్రేలియా జట్టు నుంచి విడిపోయారు.

ఈ లిస్టులో మరో కీలక ఆటగాడు అయినా అజయ్ జెడేజా కూడా ఉన్నారు. ఈయన టీమిండియా క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా సేవలందించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఈ లిస్టులో మరో టీమిండియా ఆటగాడు లాల్‌చంద్ రాజపుత్ కూడా ఉన్నారు. ఈయన 1985 నుండి 1987 వరకు టీమిండియాకు సేవలందించాడు. ఇక ఆ తర్వాత తన కెరియర్ ను కోచింగ్ లో కొనసాగిస్తూ 2016 నుంచి 2017 వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు, ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు జింబాబ్వే టీంకు ప్రధాన కోచ్ గా పనిచేశారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన యూఏఈ జట్టుకు 2024లో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు.


ఇక చివరగా ఈ లిస్టులో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ సింగ్ కూడా ఒకరు. అండర్ 19 క్రికెట్ తన కోచింగ్ కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన 2004లో హాంకాంగ్ జట్టుకు కోచ్ గా వ్యవహరించారు. ఆయన అంతర్జాతీయ కోచింగ్ అనుభవంతో పలు ఐపిఎల్ టీమ్స్ కి, అలాగే వివిధ t20 లీగ్లలో కోచ్ గా పని చేసిన అనుభవం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: