మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కనిపించనుంది. గ్రూప్ Aలో ఉన్న భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగే మ్యాచ్‌ తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఆటతీరుపై ఓ లుక్కేద్దాం.

భారత మహిళల జట్టు మొత్తం 8 ఎడిషన్లలో పాల్గొంది. కానీ., ఇప్పటివరకు టైటిల్ గెలవలేకపోయింది. భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన 2020 ఎడిషన్‌లో వచ్చింది. జట్టు రన్నరప్‌గా నిలిచింది. చివరి మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 184/4 స్కోరు చేసింది. ఆ తర్వాత భారత జట్టు కేవలం 99 పరుగులకే పరిమితమై 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 6 టైటిళ్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) గెలుచుకుంది. దీంతోపాటు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టి20 ప్రపంచకప్ చరిత్రలో, భారత మహిళల క్రికెట్ జట్టు మొత్తం 36 మ్యాచ్‌లు ఆడగా, అందులో ఆ జట్టు 20 గెలిచి 16 ఓడింది.
భారత జట్టు విజేత శాతం 55.55గా ఉంది. ఈ టోర్నీలో భారత్ కంటే ఆస్ట్రేలియా (35), ఇంగ్లండ్ (28), న్యూజిలాండ్ (24) మాత్రమే ఎక్కువ విజయాలు సాధించాయి. ఇక భారత్‌తో పాటు వెస్టిండీస్ కూడా 20 విజయాలు నమోదు చేసింది.

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత మిథాలీ రాజ్‌ పై ఉంది. భారత మాజీ కెప్టెన్ 24 మ్యాచ్‌లలో 40.33 సగటుతో, 97.31 స్ట్రైక్ రేట్‌తో 726 పరుగులు చేసింది. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ 35 మ్యాచ్‌ లలో 20.57 సగటుతో, 107.66 స్ట్రైక్ రేట్‌తో 576 పరుగులు చేసింది. మందాన 21 మ్యాచ్‌ల్లో 22.45 సగటుతో 118.46 స్ట్రైక్‌రేట్‌తో 449 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత పూనమ్‌ యాదవ్‌. ఈ లెగ్ స్పిన్నర్ 18 మ్యాచ్‌ల్లో అద్భుతమైన సగటు 13.82 , ఎకానమీ రేట్ 5.60తో 28 వికెట్లు తీసింది. రాధా యాదవ్ 12 మ్యాచ్‌ల్లో 16.94 సగటుతో 17 వికెట్లు, ఎకానమీ రేటు 6.4 తో వికెట్లు సాధించింది. అనుభవజ్ఞురాలు దీప్తి శర్మ 15 మ్యాచ్‌ల్లో 25.60 సగటుతో, 6.85 ఎకానమీ రేటుతో 15 వికెట్లు పడగొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: