బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ప్రతి ఏడాది వేలకోట్ల ఆదాయం కూడా సమకూరుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ఎంతో పేరుందిన టోర్నీలో పాల్గొనేందుకు విదేశీ ఆటగాళ్లు కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే అంతర్జాతీయ మ్యాచ్లను వదిలేసి మరి ఐపీఎల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ క్రికెట్లో ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లు ఐపిఎల్ లో సహచరులుగా మారిపోయి పోటీ పడుతూ ఉంటే చూడటానికి క్రికెట్ ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవు. కాగా ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉంది బీసీసీఐ. మరికొన్ని రోజుల్లో మెగా వేలం కూడా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ టోర్నీ గురించి అప్పుడప్పుడు పలువురు మాజీ ప్లేయర్లు సీనియర్ ప్లేయర్లు స్పందిస్తూ తమ ఆల్ టైం ఫేవరెట్ ఐపిఎల్ 11 టీం ఏంటి అన్న విషయాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇలా ప్రకటించడం ఒక ట్రెండ్ గా మారిపోయింది.


 అయితే ఇటీవల టీమ్ ఇండియా వెటరన్  ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్ టైం ప్లేయింగ్ జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో ఐపీఎల్ ప్రేక్షకులందరికీ ఫేవరెట్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఐపీఎల్ లో పవర్ హిట్టర్లుగా పేరు సంపాదించుకున్న క్రిస్ గేల్, రసేల్ లాంటి ప్లేయర్లకు అవకాశం కల్పించలేదు అశ్విన్. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా, కిరణ్ పోలార్డు లాంటి ఆటగాళ్లను కూడా పక్కన పెట్టేసాడు. ఇక తన ఆల్టైన్ ఫేవరెట్ టీం కి ధోనీని కెప్టెన్గా ఎంచుకున్నాడు అశ్విన్. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలతో పాటు పలువురు మాజీ ప్లేయర్లకు కూడా తన ఆల్ టైం ఫేవరెట్ జట్టులో చోటు కల్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: