కాగా ప్రస్తుతం కార్ల తయారీ కంపెనీలలో టాప్ ప్లేస్ లో ఉండే వాటిలో టాటా కంపెనీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. టాటా కంపెనీ కార్ల క్వాలిటీ ఇప్పటికీ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఈ కంపెనీ మార్కెట్లో టాప్ లోనే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా టాటా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కార్లలో టాటా సుమో కూడా ఒకటి. అప్పట్లో ఈ కారు మార్కెట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. భారీ మొత్తంలో సేల్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే టాటా సుమో కారుకు.. ఆ పేరు పెట్టడం వెనక కారణం ఏంటి అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
అయితే ఆ కారుకి స్పెషల్గా ఈ పేరు పెట్టడం వెనక ఒక పెద్ద కారణమే ఉందట. టాటా మోటార్స్ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లు అందరూ మధ్యాహ్నం ఒకే చోట భోజనం చేసేవారట. కానీ సుమంత్ మూల్ గావ్కర్ అనే వ్యక్తి మాత్రం వారిలో కనిపించేవాడు కాదు. ఒకరోజు ఇక మిగతా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా తన సహచరుడైన సుమంతుని అనుసరించారట. ఇక అతను పక్కనే ఉన్న దాబా వద్ద ట్రక్కు డ్రైవర్లతో భోజనం చేస్తూ.. ఇక వారితో మాటలు కలిపేవాడట. వాహనాల్లో సమస్యలను తెలుసుకుంటూ ఉండేవాడట. అయితే ఇది చూసి.. ఆయన పని నిబద్ధతకు గుర్తింపుగా.. టాటా సుమో అనే పేరును కంపెనీ పెట్టిందట. సుమంత్ లోని su మూల్ గావ్కర్ లోని MO పదాలను సేకరించి ఇక సుమో అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది.