2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి అటు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది. దీంతో ఈ విషయం గురించి అంతటా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. గత ఏడాది రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతను అసంతృప్తితో ఉన్నాడని.. దీంతో ముంబై నుంచి బయటికి వచ్చి వేలంలో పాల్గొంటాడంటూ వార్తలు వస్తున్నాయి.


 ఈ క్రమంలోనే ఒకవేళ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను కాదని బయటికి వస్తే.. ఇక అతన్ని సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ లోనే అన్ని ఫ్రాంచైజీలు కూడా తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది అంటూ అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరియు ముఖ్యంగా లక్నో జట్టు మొదటి టైటిల్ గెలుచుకోవడానికి ఆశగా ఉందని  దీంతో తప్పకుండా రోహిత్ లాంటి కెప్టెన్ కావాలని కోరుకుంటుందని అతని కోసం ఎంత ధర పెట్టడానికైనా సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏకంగా 50 కోట్లు పెట్టి మరి రోహిత్ ను దక్కించుకోవాలని లక్నో  ప్రణాళికలను సిద్ధం చేసుకుంది ఒక టాక్ వైరల్ గా మారింది.


 అయితే ఇలాంటి వార్తలపై లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయంక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాలరీ క్యాప్ లో ఒక ఆటగాడికే సగం డబ్బులు ఖర్చు చేస్తే.. మిగతా 22 మంది ఆటగాళ్ళను ఎలా కొనాలి. అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదిలేస్తుందో లేదో తెలియదు. వేలానికి వస్తారో రారో అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక రోహిత్ కోసమే 50 కోట్లు లక్నో కేటాయించబోతుంది అని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానం మాత్రమే అంటూ సంజీవ్ గోయెంకా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక రోహిత్ మళ్లీ ఏ టీంలోకి వెళ్ళబోతున్నాడు అనే విషయంపై చర్చ మరింత తీవ్రతరం అయ్యింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: