అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తిరుగులేని ఆటగాడిగా ఎదిగి 472 వికెట్లు తీసిన పంకజ్ సింగ్ కి టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్లో ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఎంతలా అంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అతనిదే ఒక చెత్త డెబ్యు మ్యాచ్ కావడం గమనార్హం. అతను టీం ఇండియా తరఫున కేవలం రెండు టెస్టులు, ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2014లో దేశవాలి క్రికెట్ లో అడుగుపెట్టి అనూహ్యంగా టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు పంకజ్ సింగ్ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పంకజ్ కు జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్లు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తనకు తిరుగులేదు అని నిరూపించిన పంకాజ్ టీమిండియా తరఫున మాత్రం దారుణంగా నిరాశపరిచాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 37 ఓవర్లు వేసిన పంకజ్ రెండో ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు వేశాడు. మొత్తంగా 47 ఓవర్లు వేసిన అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాదు పంకజ్ రెండు ఇన్నింగ్స్ లు కలిపి 179 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా ఇండియన్ క్రికెట్ హిస్టరీ లోనే టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న పేసర్ గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఎన్ని ఓవర్లు వేసినప్పటికీ తన ఫేస్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఇలా మొదటి టెస్టులోనే విఫలమైనప్పటికీ అతని మీద నమ్మకంతో రెండో టెస్టులో కూడా కొనసాగించారు సెలెక్టర్లు. అయితే రెండో టెస్టులో మాత్రం రెండు వికెట్లు తీసి పరవాలేదనిపించాడు.