ఇండియాలో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో టీమ్ ఇండియాలో స్థానం కోసం మునుపటితో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. ఎంత గొప్ప ఆటగాడు అయినా సరే ఇక ఈ ప్రతి మ్యాచ్ లో కూడా తమను తాను నిరూపించుకోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ తామేంటో నిరూపించుకున్నాం కదా.. ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏముంది అనుకుంటే మాత్రం చివరికి సెలెక్టర్లు నిర్మొహమాటంగా అలాంటి స్టార్ ప్లేయర్లను పక్కన పెట్టేయడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఇలా ఒక్కసారి జట్టులో చోటు కోల్పోయిన ఆటగాడు.. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడు అనే విషయంపై కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే జట్టులో ఛాన్సులు దక్కించుకుంటున్న  ఎంతోమంది యువ ఆటగాళ్లు ఎప్పటికప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇక ఆయా ఆటగాళ్లను జట్టు నుంచి పక్కన పెట్టలేక.. ఇక అప్పటికే జట్టులో చోటు కోల్పోయిన ఆటగాళ్లకు.. మళ్ళీ రి ఎంట్రీ కోసం ఛాన్స్ ఇవ్వలేక సెలెక్టర్లు.. కొన్ని కొన్ని సార్లు సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలా టీంలో చోటు కోల్పోయిన ఆటగాళ్ళు చాలా కాలం పాటు పునరాగమనం కోసం వేచి చూసినప్పటికీ చివరికి నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు.



 అయితే భారత పేస్ బౌలర్ బరిందర్ శ్రాని క్రికెట్కు ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ళ ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ టీమిండియా తరఫున ఆరు వన్డేలు రెండు టీ20 మ్యాచ్ లు ఆడాడు. అయితే రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 13 వికెట్లు తీశాడు. 2016లో వన్డే టీ20 లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను తన చివరి మ్యాచ్లు కూడా అదే ఏడాది ఆడాడు. ఐపీఎల్లో సన్రైజర్స్, పంజాబ్, ముంబై జట్ల తరఫున ఆడి 24 మ్యాచ్ లలో 18 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత  దేశవాళీ క్రికెట్లో కూడా పెద్దగా రానించకపోవడంతో.. ఇక అతనికి అటు టీమ్ ఇండియాలో చోటు దక్కలేదు. దీంతో చివరికి కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: