సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ప్రతి ఆటగాడు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక ఎన్నో అరుదైన రికార్డులు సాధించాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం పాటు తన కెరీర్ను సాగించాలని ఆశపడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ ఏజ్ ఏది అంటే 40 ఏళ్ళ వయస్సు అని చెబుతూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ నిపుణులు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు 4ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం చేశారు.


 ఈ మధ్యకాలంలో మాత్రం మూడు ఫార్మాట్లలో రాణించలేకపోతున్న కొంతమంది క్రికెటర్లు.. 35 ప్లస్ వయస్సులోనే రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఏదో ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్లలో కొనసాగడానికి ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమందికి క్రికెటర్లు మాత్రం చివరికి ఊహించని రీతిలో తమ కెరియర్ కు వీడ్కోలు పలికి అభిమానులకు సైతం షాక్ ఇస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ విల్ పోకోస్కి సైతం ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు. అది కూడా కేవలం 26 ఏళ్లకే ఇలాంటి నిర్ణయం తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియన్ క్రికెట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.



 ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ విల్ పుకోస్కి 26 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించాడు. కాగా అనారోగ్య కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశానికి చెందిన ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. అతడికి ఎన్నోసార్లు తలకు గాయమైందని.. వైద్య నిపుణులు, పానెల్ సూచనలతో ఇక క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ తెలిపింది. కాగా 2020 - 21 లో టీమ్ ఇండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఇతగాడు 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: