విడాకుల విషయాన్ని వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇది వారికి చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొనడం జరిగింది. ఇదే క్రమంలో అనన్య పాండే, జాస్మిన్ వాలియాతో డేటింగ్ లో హార్ధిక్ ఉన్నారంటూ అనేక రకాల పుకార్లు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఏకంగా తనకు హార్దిక్ పాండ్యా అంటే పిచ్చి అంటూ ఓపెన్ గా సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఆ బ్యూటీ ఇషిత రాజ్.
తాజాగా బాలీవుడ్ భామ ఇషిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....క్రికెటర్ హార్దిక్ పాండ్యా అంటే తనకు చాలా ఇష్టమని, అతను ఓ అద్భుతమైన క్రికెటర్ అని పేర్కొంది. అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. హార్దిక్ ను ప్రేమిస్తున్నాను నిజం చెప్పాలంటే హార్దిక్ అంటే నాకు చాలా పిచ్చి. నా అభిమాన క్రికెటర్ అంటూ ఓపెన్ అయ్యింది. ఆల్ రౌండర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై మనసు పారేసుకున్న ఇషిత రాజ్ బ్యాక్గ్రౌండ్ ఓసారి పరిశీలిస్తే....హార్దిక్ కన్నా నాలుగు సంవత్సరాలు పెద్దది.
పాండ్యాకు 30 ఏళ్లు కాగా, ఇషితకు 34 సంవత్సరాలు. ఇషిత ఢిల్లీ వాసి అయిన ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ఢిల్లీలోని గర్గి కాలేజ్ లో బీకామ్ చదువుకుంది. ఆ తర్వాత లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ లో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ బ్యూటీ 2011లో ప్యార్ కా పంచ్ నామా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇషిత చేసిన కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.