అయితే ఏ ఫార్మాట్లో అయినా సరే ఒక ఆటగాడు సెంచరీ చేశాడు అంటే చాలు ఇక అతని ఆనందానికి అవదులు ఉండవు. ఇక అటు క్రికెట్ విశేషకులు కూడా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఒక ఆటగాడు తప్పకుండా సెంచరీ చేస్తాడు అనుకున్న సమయంలో ఊహించని రీతిలో వికెట్ కోల్పోతే అభిమానులు ఒక్కసారిగా నిరాశపడుతూ ఉంటారు. సాధారణంగా దూకుడుగా ఆడుతున్న ఆటగాడు 80 లేదా 90 పరుగుల వద్ద వికెట్ కోల్పోతేనే ఇలా అభిమానులు నిరాశ చెందుతూ ఉంటారు.
అలాంటిది ఏకంగా 99 పరుగుల వద్ద సెంచరీని మిస్ చేసుకుంటే కేవలం అభిమానులే కాదు.. సదరు ప్లేయర్ కూడా ఎంతో ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇండియన్ క్రికెట్ లో వన్ డే ఫార్మాట్లో ఇలా 99 వరకు పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ చేసుకున్న బ్యాటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1984లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో క్రిస్ శ్రీకాంత్ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
2002లో వెస్టిండీస్తో మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్.
2004లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్.
2007లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లతో జరిగిన మూడు మ్యాచ్ లలో సచిన్ టెండూల్కర్ 99 పరుగుల వద్ద ఓటు అయ్యాడు.
2013లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఇలా 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.