అయితే మరో యాంగ్ క్రికెటర్ ఇలా ఐపిఎల్ లో సత్తా చాటుతు ఉండడంతో అటు ఇండియన్ క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. అతను తమ అభిమాన జట్టులో లేకపోయినప్పటికీ అతను ఆడుతున్న తీరుకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యి అతనికి మద్దతుగా నిలిచారు. అయితే అతని ప్రతిభ చూసిన అందరూ అతి తక్కువ సమయంలోనే అతను టీమ్ ఇండియాలోకి వస్తాడని ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్లుగానే అతను టీమిండియాలో ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్లో అతను లక్నో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి.
ఇలా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్ ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నాడు. అక్కడ కౌంటి క్రికెట్ ఆడుతున్నాడు. అయితే కౌంటింగ్ క్రికెట్లో కూడా ఇక ఇప్పుడు సాయి సుదర్శన్ అదరగొట్టేసాడు. సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ క్రికెటర్ ఇటీవలే నాటింగ్ హామ్ షైర్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగి 178 బంతులు ఆడి 10 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 105 పరుగులు బాదాడు. సుదర్శన్ జోరుతో సర్రే జట్టు 525 / 10 పరుగులు చేసింది. ఇక ఈ విషయం తెలిసి ఈ యంగ్ క్రికెటర్ కు ఎక్కడికి వెళ్లినా తిరుగులేదు అని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఐపిఎల్ సీజన్లో సాయి సుదర్శన్ ఏకంగా 503 పరుగులు చేశాడు.