అందుకే అటు టి20 ఫార్మాట్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. క్రీజు లోకి వచ్చే ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే మైండ్ సెట్ తో ఉంటాడు. అందుకే రావడం రావడమే మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్లు కొట్టడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న బ్యాట్స్మెన్ ను ఆపడం చాలా కష్టం అని చెప్పాలి. అందుకే ప్రతి బంతిని కూడా ఎంతో వైవిధ్యంగా సందించేందుకు బౌలర్లు కష్టపడుతూ ఉంటారు. కానీ చాలా మటుకు బౌలర్లు పరుగులను కట్టడి చేయడంలో విఫలమౌతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి టి20లలో ఇక్కడ ఒక బౌలర్ మాత్రం అద్భుతమే చేసి చూపించాడు.
అతని బౌలింగ్ గణాంకాలు చూసి మాయ చేశాడా.. మంత్రం వేసాడా అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. హాంగ్కాంగ్ కు చెందిన ఆయుష్ శుక్ల ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే నాలుగు ఓవర్లు వేశాడు. మంగోలియా తో జరిగిన టి20 మ్యాచ్ లో ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు. తద్వారా ఒకే మ్యాచ్లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడవ బౌలర్గా నిలిచాడు. 2024 t20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫేసెస్ పెర్క్యూసన్ PNG పై జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు అంతకు ముందు 2021లో కెనడా బౌలర్ సాద్విన్ జాఫర్ టి20 వరల్డ్ కప్ యూఎస్ క్వాలిఫైయర్ లో పనామా పై ఈ రికార్డు సాధించడం గమనార్హం.