17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవల టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ ను అందుకుంది అన్న విషయం తెలిసిందే. t20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా.. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ టీమిండియా కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక ఇలా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


 అయితే మ్యాచ్ మొత్తం ఎంత ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ.. చివర్లో విన్నింగ్ మూమెంట్ ఏది అంటే మాత్రం సూర్య కుమార్ యాదవ్ బౌండరీ వద్ద ఎంతో విన్యాసం చేసి పట్టిన క్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2024 t20 వరల్డ్ కప్ అనే పేరు గుర్తుకు వచ్చినప్పుడల్లా భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా సూర్యకుమార్ యాదవ్ బౌండరీ వద్ద పట్టిన క్యాచ్ తప్పకుండా గుర్తుకు వస్తూ ఉంటుంది. సరైన సమయంలో అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టి టీమ్ ఇండియాను విశ్వ విజేతగా నిలపగలిగాడు సూర్య కుమార్ యాదవ్.


 అయితే ఇది అవుట్ కాదని సిక్సర్ అంటూ దక్షిణాఫ్రికా అభిమానులు సోషల్ మీడియాలో వాదనలు కూడా వినిపించారు. అయితే ఇటీవల ఇదే విషయం గురించి సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ షంసి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గల్లీ క్రికెట్లో బౌండరీ లైన్లో అందుకున్న క్యాష్ ని కొందరు యువకులు పరీక్షించిన తీరుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ఇదే తరహాలో వరల్డ్ కప్ ఫైనల్లో సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ని పోస్ట్ చేస్తే ఫలితం మరోలా ఉండేదని.. మిల్లర్ నాట్ అవుట్ అని షంషీ ఫన్నీగా ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: