ప్రపంచంలోనే ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలమైన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో చాలామంది స్టార్ ప్లేయర్లు ఉంటారు. అదే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ నాథన్ బ్రాకెన్ ఒకరు. అప్పట్లో ఈ మాజీ బౌలర్ నాథన్ బ్రాకెన్ బంతులు వేస్తుంటే బ్యాటర్లు భయపడి పోయేవారు.


అయితే అలాంటి బౌలర్ ఇప్పుడు ఓ చిన్న బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 2001లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాథన్ బ్రాకెన్ 116 వన్డేలు, 5 టెస్టులు, 19 టీ20 మ్యాచ్ లు ఆడిన నాథన్ బ్రాకెన్ ఇప్పుడు ఓ చిన్న బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటి ఓ మాజీ క్రికెటర్ అంత మంచి కెరీర్ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇలా అతని పరిస్థితి మారిపోయింది అంటూ క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.


నాథన్ బ్రాకెన్ 2009లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మోకాలి గాయంతో టీమ్ లో స్థానం కోల్పోయిన నాథన్ బ్రాకెన్ ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే తనను బలవంతంగా రిటైర్ చేశారని, తన గాయానికి నష్టపరిహారం చెల్లించాలంటూ 2011లో క్రికెట్ ఆస్ట్రేలియా పై ఆ దేశపు సుప్రీంకోర్టులో నాథన్ బ్రాకెన్ కేసు కూడా వేయడం జరిగింది. తన చికిత్స కోసం, అలాగే మిగతా జీవితం కోసం తనకు నష్టపరిహారం ఇవ్వాలని కోరడం జరిగింది.


ఆ తర్వాత మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. కొంత సొమ్మును మాత్రమే వారు చెల్లించినట్లు సమాచారం అందింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత క్రికెట్ కు పూర్తిగా దూరమైన నాథన్ బ్రాకెన్ తను జీవనోపాధి కోసం అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అయితే అతనికి 2008లో ఐపిఎల్ లో ఆర్సిబీ తరపున ఆడెందుకు అవకాశం వచ్చినప్పటికీ దాన్ని నాథన్ బ్రాకెన్ తిరస్కరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: