ఇండియాలో క్రికెట్ కి ఎంత విపరీతమైన క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అయితే తమ అభిమాన క్రికెటర్లను దేవుళ్ళ లాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. కాగా భారత క్రికెటర్లకు కేవలం ఇండియాలో మాత్రమే కాదు వరల్డ్ క్రికెట్లో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.


 టీమిండియా క్రికెటర్లు ఎవరూ కూడా ఇతర దేశాలు క్రికెట్ బోర్డులు నిర్వహించే టి20 లీగ్లలో ఆడేందుకు అనుమతి లేదు. దీంతో ఇక భారత జట్టు ఆటగాళ్ల ఆట చూడాలంటే కేవలం అంతర్జాతీయ మ్యాచ్లలో మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఇక టీమిండియా ప్లేయర్లకు మంచి క్రేజ్. కానీ మహిళ క్రికెటర్ల విషయంలో ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అందుకే ఎంతో మంది భారత మహిళా క్రికెటర్లు ఇతర దేశాల టీ20 లీగ్లలో కూడా ఆడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఇక అక్కడ భారత క్రికెటర్లను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేస్తూ ఉంటాయి ఆయా ఫ్రాంచైజీలు.


 ఇప్పటివరకు ఇలా జరగడం ఎన్నోసార్లు చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఊహించని ఘటన జరిగింది. ఏకంగా టీమిండియా కెప్టెన్ అయిన ప్లేయర్ అన్ సోల్డ్ గా మిగిలిపోయింది. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, జట్టులో స్టార్ స్పిన్నర్గా కొనసాగుతున్న శ్రేయంక పాటిల్ లను బిగ్ బాస్ లీగ్ డ్రాఫ్ట్ లో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కాగా ఈ లీగ్ లో ఇప్పటివరకు హార్మన్ ఐదు సీజన్లలో 62 మ్యాచులు ఆడి 117.16 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశారు. 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా కూడా ఉంది హార్మన్ ప్రీత్. మరోవైపు 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విన్నింగ్ ఆర్సిబిజట్టులో సభ్యురాలుగా ఉంది శ్రేయంక. అలాంటి ఇద్దరు ప్లేయర్లు అన్ సోల్డ్ గా మిగిలిపోవడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: